గ్రీన్‌కార్డు కావాలా?.. ముందు మీ సొంత దేశానికి వెళ్లండి: ట్రంప్ సర్కార్ కొత్త రూల్
- గ్రీన్ కార్డ్ దరఖాస్తు నిబంధనలను మార్చిన అమెరికా
- తాత్కాలిక వీసాలపై ఉన్నవారు దేశం విడిచి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి
- 'అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్' విధానానికి స్వస్తి
- విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక ఉద్యోగులపై ప్రభావం
అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు అక్కడి ప్రభుత్వం కీలకమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఇకపై తప్పనిసరిగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కొత్త పాలసీ మెమోను జారీ చేసింది.
ఇంతకాలం అమెరికాలో విద్య, పర్యాటక, ఉద్యోగ వీసాలపై ఉన్నవారు దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 'అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్' (ఏఓఎస్) అనే వెసులుబాటు ఉండేది. లక్షలాది మంది ఈ విధానాన్ని ఉపయోగించుకున్నారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం ఈ విధానాన్ని కేవలం 'అసాధారణమైన ఉపశమన చర్య'గా వర్గీకరించారు. అంటే, అత్యంత అరుదైన, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీనికి అనుమతి లభిస్తుంది. మిగతా వారందరూ తమ దేశాలకు వెళ్లి, అక్కడి అమెరికా కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
ఇది చట్టం అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరించడమేనన్న యూఎస్సీఐఎస్
ఈ కొత్త విధానం వల్ల అమెరికాలో ఉన్న విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగులు, పర్యాటకులపై తీవ్ర ప్రభావం పడనుంది. యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కేలర్ మాట్లాడుతూ.. "చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరించడానికే ఈ మార్పులు చేస్తున్నాం. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారు, గడువు ముగిశాక దేశం విడిచి వెళ్లాలి. గ్రీన్ కార్డ్ కావాలనుకుంటే, వారి సొంత దేశం నుంచే దరఖాస్తు చేసుకోవాలి. ఇది చట్టం ఉద్దేశించిన విధంగా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పనిచేయడానికి దోహదపడుతుంది" అని వివరించారు.
దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు అక్రమంగా అమెరికాలో ఉండిపోవడాన్ని ఈ విధానం నివారిస్తుందని ఆయన తెలిపారు. అంతేగాక ఈ మార్పుల వల్ల యూఎస్‌సీఐఎస్‌పై భారం తగ్గి, హింసకు గురైన బాధితులకు వీసాలు, పౌరసత్వ దరఖాస్తుల వంటి ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.